News June 23, 2024

సంచలన కేసు.. 48 గంటల్లో నిందితులు అరెస్ట్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాపట్ల(D) ఈపురుపాలెం హత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై CM సీరియస్ కావడం, <<13485589>>హోం మంత్రి<<>> ప్రత్యేక దృష్టి సారించడంతో కేసును సవాలుగా స్వీకరించి 48 గంటల్లోనే ఛేదించినట్లు SP వకుల్ తెలిపారు. నిందితులు దేవరకొండ విజయ్, మహేశ్‌తో పాటు శ్రీకాంత్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. మద్యం మత్తులో యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారన్నారు.

Similar News

News November 25, 2025

కడప జిల్లా హెడ్ క్వార్టర్‌కు ప్రొద్దుటూరు సీఐ..!

image

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ తిమ్మారెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి అక్కడ రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. బంగారు వ్యాపారి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామిపై డబ్బు ఎగవేత, చీటింగ్, కిడ్నాప్ ఫిర్యాదులున్నాయి. ఈ కేసుల్లో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ తిమ్మారెడ్డి విచారణ చేపట్టారు. విచారణ తీరుపై సీఐపై ఆరోపణలొచ్చి ఆయనను హెడ్ క్వార్టర్‌కి పంపినట్లు సమాచారం.

News November 25, 2025

మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

image

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్‌ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.

News November 25, 2025

నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

image

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.