News August 27, 2024
ఒవైసీ కాలేజీ కూల్చివేతపై ‘హైడ్రా’ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

HYD చాంద్రాయణగుట్ట సలకం చెరువులోని ఒవైసీకి చెందిన <<13945547>>ఫాతిమా<<>> కాలేజీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడే కూల్చితే వాళ్ల అకడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవుతుంది. ఒవైసీ అయినా, మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్. అక్రమ కట్టడాలు అయితే తొలగించేందుకు సమయం ఇస్తాం. వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.
Similar News
News December 4, 2025
ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ: గడ్కరీ

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల టోల్ పేరుతో NHలపై ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చన్నారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో అమలవుతోన్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లతో 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని లోక్‌సభలో తెలిపారు.
News December 4, 2025
ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే?

ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు బిడ్డకు కవచంలా ఉంటూ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం ఎక్కువవుతుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది అవుతుంది. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉమ్మనీరు ఎంత ఉందో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 4, 2025
ప్రభుత్వ స్కూళ్లలో ‘క్లిక్కర్’ విధానం

AP: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పాఠాల రివిజన్‌కు ప్రభుత్వం ‘క్లిక్కర్’ విధానాన్ని తీసుకురానుంది. లెసన్ పూర్తయిన తర్వాత స్టూడెంట్లకు క్లిక్కర్ ఇస్తారు. అందులో A, B, C, D, యెస్, నో, హ్యాండ్ రైజ్ ఆప్షన్లు ఉంటాయి. క్లాస్ రూమ్‌లోని డిజిటల్ బోర్డులో ప్రశ్న డిస్ప్లే అవుతుంది. దానికి క్లిక్కర్ ద్వారా ఆన్సర్ ఇవ్వాలి. ఈ విధానాన్ని రేపు తొలిదశలో 53 స్కూళ్లలో CM చంద్రబాబు ప్రారంభించనున్నారు.


