News December 27, 2024
మన్మోహన్ సింగ్‌పై సంచలన కామెంట్స్
నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై శివసేన(షిండే) నేత, మాజీ MP సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన్మోహన్ గొప్ప నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన పాలనపై ఎన్నో మచ్చలున్నాయి. అవి ఇప్పటివరకు చెరిగిపోలేదు’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘అప్పుడు మీరూ ఆ ప్రభుత్వంలోనే ఉన్నారుగా’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల MH అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంజయ్ కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరారు.
Similar News
News December 28, 2024
RECORD:10 నిమిషాలకో ₹50L కారు అమ్మకం
సంపద, సంపన్నులు పెరగడంతో లగ్జరీ కార్ల అమ్మకాల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2024లో ప్రతి 10 నిమిషాలకో ₹50L పైబడిన కారును అమ్మింది. తొలిసారి ఒక ఏడాదిలో 50వేల లగ్జరీ కార్ల ఘనతను అందుకుంది. 2025లో 54వేలకు చేరుతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. 2024లో మెర్సిడెస్ బెంజ్ 20వేలు, BMW 12వేల కార్లను అమ్మినట్టు సమాచారం. ఇవి సగటున 15% గ్రోత్ నమోదు చేశాయి. వివిధ కారణాలతో AUDI కార్ల సేల్స్ 16% తగ్గాయి.
News December 28, 2024
BREAKING: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
TG: ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని కోరింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది. ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
News December 28, 2024
రూ.6,000 కోట్ల పోంజీ స్కామ్.. నిందితుడు అరెస్ట్
రూ.6వేల కోట్ల పోంజీ స్కామ్ ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్‌ను సీఐడీ అరెస్టు చేసింది. గుజరాత్ మెహసానా జిల్లాలోని ఓ గ్రామంలో దాక్కున్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అయిన ఇతను బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి వేలాది మందిని మోసం చేశారు. కొన్ని నెలలుగా అతను సీఐడీకి దొరక్కుండా తిరుగుతున్నారు.