News March 26, 2025
అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

TG: సంచలనం రేపిన <<10880696>>అప్సర<<>> హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమెను హత్య చేసిన నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవితఖైదు విధించింది. కొన్నేళ్లుగా అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన సాయికృష్ణ 2023లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి, అప్సర కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టగా సాయికృష్ణే నిందితుడని తేలింది.
Similar News
News March 29, 2025
డేటింగ్ యాప్‌లో ప్రేమ.. రూ.6.5 కోట్లు పోగొట్టుకున్నాడు

డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళను నమ్మి ఓ వ్యక్తి ₹6.5Cr పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్‌సింగ్ ఓ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో విడాకులు కావడంతో ప్రేమ కోసం యాప్‌లో ప్రయత్నించగా అనిత పరిచయమైంది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులతో డబ్బు సంపాదించొచ్చని నమ్మించింది. తొలుత ₹3.2Lకు గంటల్లోనే ₹24K లాభం చూపింది. దీంతో ₹6.5Cr ఇన్వెస్ట్ చేయగా ముంచేయడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.
News March 29, 2025
బుమ్రా ఎప్పుడొస్తారో చెప్పలేం: జయవర్ధనే

పేసర్ జస్ప్రీత్ బుమ్రా బాగా కోలుకున్నారని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. అయితే ఎంట్రీ ఎప్పుడన్నది చెప్పలేమని తెలిపారు. ‘బుమ్రాను ఫలానా మ్యాచ్‌లోపు తీసుకురావాలన్నదేమీ మేం పెట్టుకోలేదు. తన రోజూవారీ వర్కవుట్స్‌ను క్రమం తప్పకుండా ఏ సమస్యా లేకుండా పూర్తి చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ఆడొచ్చనదానిపై NCA ఏ క్లారిటీ ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. BGT సమయంలో బుమ్రాకు వెన్నెముక గాయమైంది.
News March 29, 2025
ఎంపురాన్‌లో ఆ సీన్స్ కట్ చేస్తున్నాం: నిర్మాత

మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమాపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని నిర్మాత గోకులం గోపాల్ స్పందించారు. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు పృథ్వీరాజ్‌కు సూచించినట్లు తెలిపారు. ఎంపురాన్ సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలతోపాటు ఓవరాల్‌గా కథను ఒక వర్గాన్ని కించపరిచేలా తీశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.