News August 5, 2025

డా.నమ్రత కేసులో సంచలన విషయాలు

image

TG: ‘సృష్టి’ ఫేక్ సరోగసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ మోసాలపై పోలీసులు ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతో డా.నమ్రతకు సంబంధాలున్నట్లు గుర్తించారు. ఏజెంట్ల సాయంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు తేల్చారు. అస్సాం, బిహార్, ముంబై, రాజస్థాన్ నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసులు చేశామని నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 8, 2026

పాక్ ఏజెంట్‌తో గొగొయ్‌కి సంబంధాలు: CM

image

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్‌పై అస్సాం CM హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘పాక్ ఏజెంట్ అలీ తౌఖీర్‌‌తో గౌరవ్ గొగొయ్‌, ఆయన భార్య ఎలిజబెత్‌(బ్రిటిష్ పౌరురాలు)కి సంబంధాలున్నాయి. 44పేజీల SIT నివేదిక ప్రకారం ఆమె కీలక సమాచారం పంచుకున్నట్లు ఉంది. పాక్‌కు చెందిన ఓ సంస్థ ఆమెకు జీతమిచ్చింది. గొగొయ్‌తో వివాహమయ్యాక ఆమె 9సార్లు పాక్ వెళ్లారు. గౌరవ్ కుటుంబంలో మరొకరు పాక్‌కు సహకరిస్తున్నారు’ అని ఆరోపించారు.

News February 8, 2026

‘సూపర్ హ్యూమన్స్’ని సృష్టించాలన్న ఎప్‌స్టీన్!

image

సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ ఓ ‘సూపర్ హ్యూమన్ రేస్’ను సృష్టించాలని ప్రయత్నించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. “మరణానికి ముందు తన వింత కోరికను వెలిబుచ్చారు. తన DNAతో గొప్ప మేధస్సు కలిగిన పిల్లలను పుట్టించాలని కోరారు. గతంలోనూ న్యూమెక్సికోలోని తన పెద్ద పశువుల పాక(RANCH)లో మహిళలను గర్భవతులను చేయాలని శాస్త్రవేత్తలతో తరచూ చెప్పేవారు. కొందరు దానిని ‘BABY RANCH’ అని పిలిచేవారు” అని NYT పేర్కొంది.

News February 8, 2026

YS జగన్‌తో TVK విజయ్

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, తమిళ సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌లో కలిశారు. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకకు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.