News April 2, 2025
మావోయిస్టుల సంచలన ప్రకటన

కేంద్రంతో శాంతిచర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యాకాండను ఆపాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తాము సిద్ధమని చెప్పారు. ఇటీవల కేంద్రం చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.
Similar News
News April 6, 2025
నేడు ఉత్తరాఖండ్‌కు పొన్నం, సీతక్క

TG: మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క నేడు ఉత్తరాఖండ్‌కు వెళ్లనున్నారు. సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన రేపు, ఎల్లుండి డెహ్రాడూన్‌లో జరిగే చింతన్ శిబిర్ కార్యక్రమంలో పాల్గొంటారు. BC సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు వంటి అంశాలపై పొన్నం ప్రసంగించనున్నారు. మరోవైపు దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి సీతక్క వివరించనున్నారు.
News April 6, 2025
కాచుకొని ఉన్న ‘ఉపగ్రహ’ ముప్పు!

భూ కక్ష్యలో శకలాల ముప్పు నానాటికీ మరింత పెరుగుతోంది. ఉపగ్రహాలు తిరిగే వేగం కారణంగా ఒక సెం.మీ పరిమాణం ఉన్న వస్తువు ఢీకొట్టినా విధ్వంసం వేరేస్థాయిలో ఉంటుంది. భూ కక్ష్యలో అలాంటివి 12 లక్షలకు పైగా ఉన్నాయి. వీటి వల్ల ఒక ఉపగ్రహం ధ్వంసమైనా అది మిగతా శాటిలైట్లన్నింటినీ ధ్వంసం చేయొచ్చు. అదే జరిగితే భూమిపై సాంకేతికత అంతా ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉందని పరిశోధకుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News April 6, 2025
పూరీ-విజయ్ సేతుపతి సినిమాలో టబు?

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో పాపులరైన ఆమెను సినిమాలోని ఓ కీలక పాత్రకు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మేలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.