News January 23, 2025

సంచలన తీర్పు.. RGVకి జైలు శిక్ష

image

2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు RGVని ముంబై అంధేరీ కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేశ్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా RGV విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.

Similar News

News April 8, 2026

ఇరాన్ షరతులు.. US ఒప్పుకుందా?

image

ఇరాన్ చేసిన 10 ప్రతిపాదనలను పాకిస్థాన్ అమెరికా ముందుంచింది. వీటిని US అంగీకరించిందని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చెబుతోంది. కానీ ఇంకా వాటిపై చర్చలు జరగలేదు. ఈ నెల 10న పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు జరపనున్నాయి. అప్పటివరకు సీజ్‌ఫైర్ అమల్లో ఉండనుంది.

News April 8, 2026

కరెంట్ అఫైర్స్ (08-04-2026)

image

☛ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ISSF) వరల్డ్ కప్‌లో భారత షూటర్లు పాలక్, ముకేశ్ నెలవల్లికి గోల్డ్ మెడల్
☛ ఒరాకిల్ కొత్త CFOగా హిలరీ మాక్సన్.. టోటల్ ప్యాకేజ్ ₹276కోట్లు
☛ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్‌గా తమీమ్ ఇక్బాల్
☛ తమిళనాడు తండ్రి-కుమారుల లాకప్ డెత్ కేసు(2020).. 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించిన మదురై కోర్టు
☛ US, ఇరాన్ మధ్య 14 రోజుల సీజ్‌ఫైర్.. మధ్యవర్తిగా పాక్

News April 8, 2026

వెనిజులా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు!

image

వెనిజులా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు ఈ నెలలోనే ఇండియాకు రానుంది. 2020 ఫిబ్రవరి తర్వాత ఆ దేశం నుంచి ఈ స్థాయిలో ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల 1 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్‌తో సూయజ్‌మ్యాక్స్ నౌక గుజరాత్‌లోని సిక్కా పోర్టుకు చేరుకుంది. హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో కొన్నిరోజులుగా సరఫరా నెమ్మదించింది. ఈ క్రమంలో దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా వెనిజులా నుంచి దిగుమతులను ఇండియా పెంచుకుంటోంది.