News July 3, 2024
ఈ ఏడాది చివరికి సెన్సెక్స్@87,000?

మరో ఆరు నెలల్లో సెన్సెక్స్ గరిష్ఠంగా 87వేల మార్క్ చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ 25,600 దాటుతుందని చెబుతున్నారు. బడ్జెట్, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, చమురు ధరలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయన్నారు. RBI సహా USలో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని, అది మార్కెట్లకు కలిసొస్తుందని చెబుతున్నారు. లార్జ్ క్యాప్ స్టాక్స్‌కు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
Similar News
News April 1, 2026
SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..

ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.00 గంటల నుంచి 11.45 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.
News April 1, 2026
నైట్‌షిఫ్టులతో క్యాన్సర్ ముప్పు: వైద్యులు

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ చేసే నర్సులు, పోలీసులు, డ్రైవర్లు, టెకీలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘దీని వల్ల జీవ గడియారం దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీనివల్ల మహిళల్లో రొమ్ము, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. నిరంతర నైట్ షిఫ్టులను WHO క్యాన్సర్ కారకంగా గుర్తించింది’ అని వారు వివరిస్తున్నారు.
News April 1, 2026
IPL: ఇది గమనించారా?

IPL-19 సీజన్‌లో నిన్నటి వరకు 4 మ్యాచులు జరిగాయి. అన్నింటిలోనూ హోం టీమ్‌లు, అదీ ఛేజింగ్ చేసిన జట్లే గెలవడం గమనించారా? తొలి 2 మ్యాచు(SRH-RCB, KKR-MI)ల్లో 200+ లక్ష్యాలను ఈజీగా ఛేదించారు. ఇక CSK-RR మధ్య లోస్కోరింగ్ గేమ్ జరిగింది. చెన్నై 127 రన్స్ చేయగా ప్రత్యర్థి జట్టు 12.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. నిన్న GT-PBKS మధ్య జరిగిన మ్యాచ్ కాస్త ఉత్కంఠ రేపినా చివరి ఓవర్ తొలి బంతికి పంజాబ్ గెలిచింది.


