News November 13, 2024
SENSEX 2 నెలల్లో 8000 పాయింట్లు డౌన్.. WHAT NEXT?

స్టాక్మార్కెట్లు బేరు బేరుమంటున్నాయి. జీవితకాల గరిష్ఠం నుంచి BSE సెన్సెక్స్ 2 నెలల్లోనే 8300 పాయింట్లు నష్టపోయింది. NSE నిఫ్టీ 26277 నుంచి 10% తగ్గింది. సూచీలు 20% తగ్గితే బేర్స్ గ్రిప్లోకి వెళ్లినట్టు భావిస్తారు. నిఫ్టీ 200 DMAను టచ్ చేయడం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ₹1000Cr MCap మీదున్న 900 స్టాక్స్ 20% క్రాష్ అవ్వడంతో బేర్ మార్కెట్లోకి ఎంటరవుతున్నామని ఇన్వెస్టర్లు నిరాశ చెందుతున్నారు.
Similar News
News December 30, 2025
అరటి పరిమాణం పెంచే ‘బంచ్ ఫీడింగ్’ మిశ్రమం

అరటి కాయల పరిమాణం పెరుగుదలకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బంచ్ ఫీడింగ్ మిశ్రమం రూపొందించింది. 100ml నీటిలో 7.5 గ్రా. నత్రజని ఎరువు, 7.5 గ్రాముల పొటాష్ ఎరువు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పైన ఫొటోలో చూపినట్లు కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి.
News December 30, 2025
రైల్వేలో 311 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

<
News December 30, 2025
వైకుంఠ ఏకాదశి వ్రత విధానం.. (1/2)

తెల్లవారుజామునే గంగాజలం కలిపిన నీటితో స్నానమాచరించి, పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. లక్ష్మీ నారాయణుల పటాన్ని అలంకరించి ధూప, దీప, పుష్ప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణు సహస్రనామం, నారాయణ మంత్రాలను జపిస్తూ, ఏకాదశి వ్రత కథను చదవాలి. హారతి ఇచ్చి వ్రతాన్ని ప్రారంభించాలి. రోజంతా తులసి తీర్థం మాత్రమే తీసుకుంటూ, హరినామ స్మరణలో గడపాలి. ముందురోజు సాత్వికాహారం తీసుకొని ఉంటే వ్రత ఫలం మెరుగ్గా ఉంటుంది.


