News July 4, 2024

తొలిసారి 80వేల మార్క్‌తో ముగిసిన సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను స్వల్ప లాభాలతో ముగించాయి. ఆరంభంలో ఉన్న జోరు చివరి దాకా కొనసాగకున్నా సెన్సెక్స్ ట్రేడింగ్ తొలిసారి 80వేల మార్క్‌లో ముగిసింది. 62 పాయింట్లు లాభపడిన సూచీ 80,049 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 24,302 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, టీసీఎస్ షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

Similar News

News March 3, 2026

ఆముదం పంట రెండో గెల దశలో ఉందా?

image

యాసంగిలో సాగు చేసిన ఆముదం పంట రెండో గెల దశలో ఉంటే నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వేసవిలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఈ పంటలో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2mlను కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో ఎండు తెగులు గమనిస్తే లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను కలిపి మొక్క మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి.

News March 3, 2026

NCC అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆర్మీలో 76పోస్టులు..

image

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు కోసం 76 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పాసై, NCC C సర్టిఫికెట్‌లో B గ్రేడ్ ఉన్నవారు మార్చి 16వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 19 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, SSB, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

News March 3, 2026

మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?

image

ఇజ్రాయెల్, US-ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్‌కు వ్యాపించింది. US-ఇజ్రాయెల్‌కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అండగా నిలిచాయి. ఇరాన్‌కు సాయం చేస్తామని చైనా ప్రకటించింది. మిడిల్ ఈస్ట్‌లో మొదలైన యుద్ధం Asia, europe దేశాలకు పాకి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోగా నిత్యావసరాలపైనా వార్ ఎఫెక్ట్ పడుతుందేమోనని సామాన్యుడిలో ఆందోళన నెలకొంది.