News April 1, 2025
భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే మార్కెట్ ఒడిదుడుకులతో మొదలైంది. ట్రంప్ సుంకాల గడువు రేపటితో ముగియనుండటంతో ఆ భయాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి.. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయి 76,024 వద్ద ముగియగా నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయి 23,165 వద్ద క్లోజ్ అయింది. మీడియా, చమురు, గ్యాస్ స్టాక్స్ తప్పితే దాదాపు మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి.
Similar News
News October 25, 2025
నాగుల చవితి: పుట్టలో పాలెందుకు పోస్తారు?

నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తే సర్వరోగాలు తొలగిపోతాయని నమ్మకం. యోగశాస్త్రం ప్రకారం.. మానవ శరీరంలో వెన్నుపాములోని మూలాధార చక్రంలో కుండలినీ శక్తి పాము రూపంలో నిద్రిస్తూ ఉంటుంది. ఇది కామ, క్రోధాలనే విషాలను కక్కుతూ సత్వగుణాన్ని హరిస్తుంది. నేడు పుట్టలో పాలు పోసి నాగ దేవతను ఆరాధిస్తే.. ఈ అంతర్గత విషసర్పం శుద్ధమై, శ్వేతత్వాన్ని పొందుతుంది. ఫలితంగా మోక్ష మార్గం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
News October 25, 2025
నేడు ఆసీస్తో భారత్ చివరి వన్డే

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ ఇవాళ చివరిదైన 3వ వన్డే ఆడనుంది. తొలి 2 వన్డేల్లో ఆసీస్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోగా, నేటి మ్యాచ్ నామమాత్రం కానుంది. దీంతో ఇరుజట్లలో కొత్త ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అటు ఇవాళ సిడ్నీలో మ్యాచ్ జరగనుండగా టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఉదయం 9గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ వన్డేలోనైనా భారత్ తిరిగి పుంజుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆటకు వర్షం ముప్పు లేదు.
News October 25, 2025
దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు?

AP: రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇదే బలమైన తుఫాన్ అని, ఈ నెల 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందన్నారు. 26 నుంచి 4 రోజుల పాటు ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని అధికారులు సూచించారు. నేడు, రేపు చాలాచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.


