News July 3, 2024
మూడు నెలల్లో 5వేల పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

బీఎస్ఈ సెన్సెక్స్ 80వేల మార్క్ తాకడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. 57 రోజుల్లోనే 5వేల పాయింట్లు వృద్ధి చెంది 75వేల నుంచి 80వేల మార్క్ చేరుకోవడం విశేషం. జూన్ 9న ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెన్సెక్స్ 3వేల పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ చరిత్రలో అత్యంత వేగంగా 5వేల పాయింట్లు పెరిగిన జాబితాలో ఈ వృద్ధి మూడోస్థానంలో ఉంది. 2021లో 28రోజుల్లోనే 5 పాయింట్లు పెరిగాయి.
Similar News
News November 14, 2025
తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.
News November 14, 2025
ఒక రౌండ్ అంటే ఏమిటి?

ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజున ‘రౌండ్’ అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. X అనే వ్యక్తి మొదటి రౌండ్లో ముందంజలో ఉన్నారు అని వింటాం. ఒక రౌండ్ అంటే 14 EVMల ఓట్ల లెక్కింపు. ప్రతి EVM ఒక బూత్ను సూచిస్తుంది. కాబట్టి ఒక రౌండ్ 14 బూత్ల ఓట్ల లెక్కింపు అని కూడా చెప్పొచ్చు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం EC ఒకేసారి 14 టేబుళ్లను ఉంచుతుంది. ఒక్కో టేబుల్పై ఒక EVM ఉంటుంది.
News November 14, 2025
అలసంద సాగు..అధిక దిగుబడినిచ్చే విత్తనం ఇదే

అలసంద 85 నుంచి 90 రోజుల పంట. దీనికి చల్కా, ఎర్రనేలలు ఈ పంటకు అనుకూలం. అన్ని కాలాల్లో విత్తుటకు టి.పి.టి.సి-29 అనే విత్తన రకం అనుకూలం. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి కార్బండజిమ్ 2గ్రా. లేదా థైరమ్ 2 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తాలి. వరుసకు వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ విత్తుకోవాలి.


