News February 4, 2025

సెన్సెక్స్ 1100 జంప్: రూ.6లక్షల కోట్ల లాభం

image

స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,666 (+320), సెన్సెక్స్ 78,250 (+1110) వద్ద ట్రేడవుతున్నాయి. కొన్ని దేశాలపై టారిఫ్స్‌ను ట్రంప్ వాయిదా వేయడం, డాలర్ ఇండెక్స్ తగ్గడం, ఆసియా స్టాక్స్ పుంజుకోవడం, బ్యాంకు, ఫైనాన్స్, O&G షేర్లలో ర్యాలీయే ఇందుకు కారణాలు. దీంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.6లక్షల కోట్ల సంపదను పోగేశారు. శ్రీరామ్ ఫైనాన్స్, LT, ADANI SEZ, BEL, TATAMO టాప్ గెయినర్స్.

Similar News

News February 23, 2026

APలో కలకలం.. మూత్రం ఆగి ఇద్దరు మృతి?

image

తూర్పు గోదావరి(D) <<19212464>>రాజమండ్రిలో<<>> అనూరియా(మూత్రం ఆగిపోవడం) కేసులు కలకలం రేపాయి. ఇప్పటివరకు ఇద్దరు చనిపోగా ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ పాలు తాగడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయనే ప్రచారం జరగడంతో పోలీసులు వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు పాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.

News February 23, 2026

అనూరియా అంటే ఏమిటి?

image

మూత్రపిండాలు సరైన మోతాదులో మూత్రాన్ని ఉత్పత్తి చేయకపోవడాన్ని అనూరియా అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్, డీహైడ్రేషన్, కిడ్నీల్లో రాళ్ల వల్ల ఈ సమస్య వస్తుంది. మూత్రం రాకపోవడం, కాళ్ల వాపు, అలసట, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది దీని లక్షణాలు. ఇదొక అత్యవసర పరిస్థితి. వెంటనే వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కావొచ్చు. కల్తీ పాలు తాగడం వల్ల రాజమండ్రిలో పలువురి మూత్రపిండాలు ఫెయిలైనట్లు సమాచారం.

News February 23, 2026

బ్యాటర్ల ఫ్లాప్ షో

image

నిన్న SAతో మ్యాచులో IND బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. డకౌట్ అవ్వడం ఈసారి ఇషాన్ వంతైంది. అభిషేక్(15) మరోసారి చెత్త షాట్‌కు బలయ్యారు. తిలక్ వర్మ(1) ఫామ్ లేమిని కంటిన్యూ చేశారు. నిలబడాల్సిన సూర్య(18) తొందరపడ్డారు. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్(11) మ్యాజిక్ చేయలేదు. దూబే(42) కాస్త నిలబడినా బౌండరీలు బాదేందుకు కష్టపడ్డారు. పాండ్య(18) హోప్ ఇవ్వకపోగా రింకూ(0) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.