News September 28, 2024
విశాఖ ఉక్కు ఏపీ ప్రజల సెంటిమెంట్: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

AP: విశాఖ ఉక్కు ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లను కాపాడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడంలో సాంకేతిక సమస్యలున్నాయని చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని చూస్తున్నామన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సంస్థను లాభాల్లోకి ఎలా తీసుకురావాలో చర్చిస్తున్నామన్నారు.
Similar News
News February 25, 2026
T20 WC: పాక్ సెమీస్ చేరాలంటే..

T20 WCలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన పాక్‌కు సెమీస్ చేరడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది శ్రీలంకపై పాక్ కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో న్యూజిలాండ్‌ను శ్రీలంక, ఇంగ్లాండ్ ఓడించాలి. అప్పుడు పాక్ మూడు పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఇక రెండోది న్యూజిలాండ్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిస్తే శ్రీలంకపై పాక్ భారీ తేడాతో గెలిచి కివీస్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించాలి.
News February 25, 2026
రష్యా-ఉక్రెయిన్ ‘కాల్పుల విరమణ’పై ఓటింగ్‌కు భారత్ దూరం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగేళ్లు పూర్తైన వేళ కాల్పుల విరమణ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలపగా, భారత్, చైనా సహా 51 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతిని నెలకొల్పాలని, యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని ఈ తీర్మానం కోరింది.
News February 25, 2026
విజయ్-రష్మిక పెళ్లి.. ఇండస్ట్రీ గెస్ట్ లిస్ట్ ఇదే

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుక జరుగుతున్నప్పటికీ.. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వీరిలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, శ్రావ్య వర్మ, ఆషికా రంగనాథ్, రాహుల్ రవీంద్రన్ వంటివాళ్లు ఉన్నారు. రేపు జరగనున్న ఈ పెళ్లికి మొత్తంగా 100 మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం.


