News November 15, 2024
మా రిలీజ్లు ఉన్నప్పుడే సెంటిమెంట్ మాటలు: నాగవంశీ

తమ సినిమాలు వస్తున్నప్పుడే పోటీ సినిమాలు సెంటిమెంట్ కార్డ్ ప్లే చేస్తుంటాయని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ‘మా సినిమాలకు పోటీగా విడుదల చేసే సినిమావాళ్లే తమ కష్టాలు, కన్నీళ్లు గురించి చెబుతుంటారు. మేం రిలీజ్ పెట్టుకున్నప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతాయో మరి! ఇకపై మేము కూడా సింపతీ మాటలు చెప్పాలేమో’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’కు పోటీగా హనుమాన్ విడుదలైన సంగతి తెలిసిందే.
Similar News
News November 21, 2025
వరంగల్: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి

వరంగల్ జిల్లాలోని గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్ అధికారులను తెలంగాణ గౌడ సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్, నేతలు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్గ్రేషియో చెల్లించాలని, తాటి, ఈత చెట్లు ఎక్కే ప్రతి గీత కార్మికుడికి సభ్యత్వాలు వెంటనే జారీ చేయాలని కోరారు.
News November 21, 2025
రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
News November 21, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు విజయానంద్ సీఎస్గా కొనసాగనున్నారు. అనంతరం సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. అదే ఏడాది మేతో ఆయన పదవీకాలం కూడా ముగియనుంది.


