News September 16, 2024

సెప్టెంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

✒ 1916: ప్రముఖ గాయని MS సుబ్బలక్ష్మి జననం
✒ 1923: సింగపూర్ జాతి పిత లీ క్వాన్‌ యూ జననం
✒ 1959: ప్రముఖ నటి రోజా రమణి జననం
✒ 1975: నటి మీనా జననం
✒ 2012: హాస్య నటుడు సుత్తివేలు మరణం
✒ 2016: హేతువాది. పౌరహక్కుల నేత బొజ్జా తారకం మరణం
✒ 2019: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం
✒ అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

Similar News

News January 6, 2026

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. ఆమె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సోనియాను అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నాయి. అయితే ప్రమాదమేమీ లేదని, రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లినట్లు వెల్లడించాయి.

News January 6, 2026

నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ (<>NML<<>>) 22 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT)ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.36వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nml.res.in/

News January 6, 2026

భూమిపైకి అంతరిక్ష ధూళి.. గుర్తించిన ఇస్రో ‘DEX’

image

భూమిపైకి ప్రతి 1000 సెకన్లకు ఒకసారి కాస్మిక్ డస్ట్ దూసుకొస్తోంది. ఇస్రో సొంతంగా తయారుచేసిన DEX (Dust EXperiment) పరికరం ఈ విషయాన్ని తాజాగా గుర్తించింది. తోకచుక్కలు, గ్రహశకలాల నుంచి ఈ ధూళి కణాలు వేగంగా భూ వాతావరణంలోకి చేరుతుంటాయి. PSLV-C58 మిషన్ ద్వారా పంపిన ఈ డస్ట్ డిటెక్టర్ అంతరిక్షంలో శాటిలైట్లకు ఉండే ముప్పును అంచనా వేయడానికి సాయపడుతుంది. భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలకు ఈ డేటా ఎంతో కీలకం.