News September 19, 2024

సెప్టెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

✒ 1887: రచయిత, నాస్తికుడు తాపీ ధర్మారావు జననం
✒ 1911: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న జననం
✒ 1924: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం
✒ 1977: క్రికెటర్ ఆకాశ్ చోప్రా జననం
✒ 1965: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం
✒ 2014: మాండలిన్ విద్వాంసుడు ఉప్పలపు శ్రీనివాస్ మరణం

Similar News

News October 14, 2025

టెన్త్ విద్యార్థులకు స్నాక్స్.. నవంబర్ నుంచే?

image

TG: ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో చదువుతూ స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు నవంబర్ నుంచే స్నాక్స్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. గతంలో సంక్రాంతి సెలవుల తర్వాత ఈ క్లాసులు ఉండగా ఈసారి 100% ఉత్తీర్ణత కోసం దసరా తర్వాత నుంచే మొదలయ్యాయి. దీంతో ముందుగానే స్నాక్స్ అందిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదం వస్తే ఉడకబెట్టిన బొబ్బర్లు, శనగలు, పల్లీలు-బెల్లం వంటివి అందించనున్నారు.

News October 14, 2025

పొద్దుతిరుగుడులో తెగుళ్ల నివారణకు ఇలా..

image

వరి కోతల తర్వాత పొద్దుతిరుగుడు పంటను సాధారణ దుక్కి పద్ధతిలో నవంబర్, డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. పంట తొలి దశలో చీడపీడలు, నెక్రోసిస్ వైరస్ తెగులు నివారణకు ఒక కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML కలిపి శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2-3టన్నుల పశువుల ఎరువు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎకరాకు 30KGల నత్రజని, 36KGల భాస్వరం, 12KGల పొటాషియం వేసుకోవాలి.

News October 14, 2025

విజయానికి 58 పరుగుల దూరంలో..

image

వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభమైంది. భారత్ గెలవడానికి మరో 58 రన్స్ అవసరం. దీంతో తొలి సెషన్‌లోనే ఇండియా విజయం సాధించే అవకాశం ఉంది. క్రీజులో రాహుల్(25), సుదర్శన్(30) ఉన్నారు. భారత్ ఈ మ్యాచులో గెలిస్తే రెండు టెస్టుల సిరీస్‌ క్లీన్‌స్వీప్ అవుతుంది.