News September 2, 2025
సెప్టెంబర్ 2: చరిత్రలో ఈ రోజు

1956: నటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ జననం
1965: భారత తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ జననం
1968: నటి, రాజకీయ నాయకురాలు జీవిత జననం
1971: నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జననం (ఫొటోలో)
2009: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం(ఫొటోలో)
2022: తెలంగాణ ఉద్యమ నేత మందాడి సత్యనారాయణరెడ్డి మరణం
Similar News
News September 2, 2025
టీచర్లు టెట్ పాస్ అయితేనే..: సుప్రీంకోర్టు

ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనీసం ఐదేళ్లు సర్వీసు ఉన్నవారంతా టెట్ పాస్ కావాల్సిందేనని తెలిపింది. ఇందుకోసం రెండేళ్ల గడువు విధించింది. ఆ లోపు అర్హత సాధించని వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా ఉమ్మడి ఏపీలో 2012లో తొలిసారి టెట్ నిర్వహించారు. అంతకుముందు ఉద్యోగంలో చేరిన 30వేల మందిపై ప్రభావం పడనుంది.
News September 2, 2025
‘కాళేశ్వరం’లో అవినీతి ఉందని కవిత CBIకి చెబుతారా?

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు, సంతోశ్ రావు <<17582704>>అవినీతికి<<>> పాల్పడ్డారని కవిత ఆరోపించడం సంచలనంగా మారింది. దీంతో కాంగ్రెస్ ఎప్పటినుంచో చేస్తున్న ఆరోపణలు నిజమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని కవిత CBIకి చెబుతారా అని హస్తం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. హరీశ్ రావు అవినీతికి పాల్పడి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారని BRS అభిమానులు కవితను నిలదీస్తున్నారు.
News September 2, 2025
CPS రద్దు చేయాలని ఉద్యోగుల పోరుబాట

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్, విజయవాడలో నల్ల దుస్తులతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, CPS రద్దు చేస్తే సీఎం రేవంత్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. అటు CPS రద్దు చేయకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఏపీ ఉద్యోగులు స్పష్టంచేశారు.