News September 23, 2024

సెప్టెంబర్ 23: చరిత్రలో ఈరోజు

image

1976: దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జననం
1985: క్రికెటర్ అంబటి రాయుడు జననం
1993: నటి షాలిని పాండే జననం
1996: నటి సిల్క్ స్మిత మరణం
2019: నటుడు కోసూరి వేణుగోపాల్ మరణం
✤అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం

Similar News

News September 23, 2024

ఫ్రెంచ్ ఫ్రైస్ మహా ప్రమాదం: వైద్యులు

image

ఫ్రెంచ్ ఫ్రైస్‌కి వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ధూమ, మద్యపానం కంటే ఇవి మరింత డేంజర్‌ అని తెలిపారు. ‘ఆలూ అనేదే కార్బోహైడ్రేట్లతో కూడుకున్నది. మధుమేహ బాధితులకు అనారోగ్యకరం. ఇక ఆ ఫ్రైస్‌ను వేపిన నూనెను అప్పటికే ఎన్నిసార్లు వేడి చేసి ఉంటారో లెక్క కూడా ఉండదు. ఆ నూనెతో ఫ్రైస్‌లో ట్రాన్స్‌ఫ్యాట్స్ తీవ్రంగా పెరుగుతాయి. ఇవి గుండెకు అత్యంత ప్రమాదకరం’ అని హెచ్చరించారు.

News September 23, 2024

ఊహ తెలిశాక నాకు తెలిసిన హీరో ఆయనే: సాయి దుర్గ తేజ్

image

మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ రికార్డు దక్కడం పట్ల ఆయన మేనల్లుడు, నటుడు సాయి దుర్గ తేజ్ హర్షం వ్యక్తం చేశారు. తనకు ఊహ తెలిశాక తెలిసిన ఏకైక హీరో చిరంజీవి మాత్రమేనని ట్వీట్ చేశారు. ‘డాన్స్ అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే డాన్స్. ఆయన స్టెప్పులే నాకు తెలిసిన డాన్స్. ఆ నాట్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం అరుదైన ఘట్టం’ అని పేర్కొన్నారు.

News September 23, 2024

పుష్పక్ బస్సుల్లో వెళ్లే వారికి 10శాతం డిస్కౌంట్

image

AP: హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ బస్సుల్లో వెళ్లేవారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం బస్సు టికెట్ ధరలో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి గ్రూప్‌గా వెళ్తే వారికి అదనంగా మరో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.