News September 24, 2024
సెప్టెంబర్ 24: చరిత్రలో ఈరోజు

1921: నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి జననం
1972: దర్శకుడు శ్రీను వైట్ల జననం
1950: భారత మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్‌నాథ్ జననం
1975: ప్రముఖ దర్శకుడు, నిర్మాత చక్రపాణి మరణం
2004: భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న మరణం
✤ఎన్ఎస్ఎస్ దినోత్సవం
Similar News
News February 7, 2026
TENTH: ఇంగ్లిష్ ఎగ్జామ్ తేదీ మార్పు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
News February 7, 2026
ముంబై: బీజేపీకి మేయర్, శివసేనకు డిప్యూటీ మేయర్

ముంబై మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే పేరును ఆ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు. కాగా 227 స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 చోట్ల (బీజేపీ- 89, శివసేన- 29) విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై శివసేన (UBT) పట్టు కోల్పోయింది.
News February 7, 2026
TISSలో ఉద్యోగాలు

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<


