News September 26, 2024

సెప్టెంబర్ 26: చరిత్రలో ఈరోజు

image

1932: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జననం
1820: ప్రసిద్ధ బెంగాలీ కవి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జననం
1867: తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జననం
1947: సంఘ సంస్కర్త బంకుపల్లె మల్లయ్యశాస్త్రి మరణం
1966: సాహిత్యవేత్త అట్లూరి పిచ్చేశ్వరరావు మరణం
✤ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి రోజు ఇలా చేస్తే..

image

నేటితో కార్తీక మాసం ముగియనుంది. కార్తీక అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుతారు. ఈసారి అది శుక్రవారం వస్తోంది. కార్తీక వ్రతం ఆచరించినవారు ఆ పుణ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఆవు నెయ్యితో వెలిగించిన 31 వత్తుల దీపాలను అరటి దొప్పలలో పెట్టి నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా చేస్తే కుటుంబంలో దారిద్ర్యం తొలగిపోతుందని నమ్మకం. ☞ పోలి పాడ్యమి కథ, పూజా టైమింగ్స్ వంటి ఇతర వివరాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 20, 2025

పోలి పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?

image

పోలి పాడ్యమిని నవంబర్ 21వ తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమై, నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకొని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6:00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం’ అని చెబుతున్నారు.

News November 20, 2025

ఫోన్‌పే టాప్!

image

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.