News September 3, 2024

సెప్టెంబర్ 3: చరిత్రలో ఈరోజు

image

1893: సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ జననం
1952: నటుడు శక్తి కపూర్ జననం
1979: నటుడు అర్జన్ బజ్వా జననం
1987: తెలుగు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు మరణం
1990: భారత క్రికెటర్ మహమ్మద్ షమీ జననం
2011: పాత్రికేయుడు, రచయిత నండూరి రామమోహనరావు మరణం
2011: పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరణం

Similar News

News December 6, 2025

మాయిశ్చరైజర్‌ వాడితే చర్మం జిడ్డుగా మారుతోందా?

image

చలికాలంలో చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి. అయితే కొందరిలో దీనివల్ల చర్మం జిడ్డుగా మారి, మొటిమలు కూడా వస్తుంటాయి. ఇలాంటప్పుడు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని వాడటం వల్ల చర్మంలోకి మాయిశ్చరైజర్ ఇంకి పొడిబారిపోకుండా సంరక్షిస్తుందంటున్నారు. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్టును కలవడం మంచిదని సూచిస్తున్నారు.

News December 6, 2025

ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

image

ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు అనుసంధానించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్‌లు పెంచారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్‌లు ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.

News December 6, 2025

రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

image

బాలీవుడ్ నటి ఆలియా భట్‌, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.