News September 11, 2024
బ్లాక్‌బస్టర్ మూవీ ’96’కి సీక్వెల్

విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్లో 2018లో వచ్చిన ’96’ మూవీ ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంది. స్కూల్ డేస్‌లో ప్రేమించుకుని విడిపోయిన హీరో, హీరోయిన్ 20ఏళ్ల తర్వాత గెట్ టు గెదర్‌లో కలుసుకోవడం, వారి మధ్య లవ్ ట్రాక్‌ను డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించారు. కాగా ఈ మూవీ సీక్వెల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు దర్శకుడు తెలిపారు. విజయ్, త్రిష డేట్స్ ఆధారంగా సినిమా పట్టాలెక్కుతుందని చెప్పారు.
Similar News
News November 1, 2025
భారత్ ఓటమి.. గంభీర్‌పై విమర్శలు

AUS టూర్లో భారత పేలవ ప్రదర్శన పట్ల కోచ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచులోనూ టాప్ వికెట్ టేకర్ అర్ష్‌దీప్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని AUS మాజీ ఓపెనర్ ఫించ్ అన్నారు. అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడంపై అశ్విన్ సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే అతడి ప్లేస్‌లో వచ్చిన హర్షిత్ నిన్న బ్యాటుతో రాణించాడని, గంభీర్ నిర్ణయం సరైనదేనని ఆయన ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
News November 1, 2025
మహిళా లెక్చరర్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య

AP: విశాఖలో సాయితేజ్(21) అనే డిగ్రీ స్టూడెంట్ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమతా కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడం, రికార్డులు రిపీటెడ్‌గా రాయించడం, మరో మహిళా లెక్చరర్‌తో కలిసి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 1, 2025
258 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. B.E./B.Tech/M.Tech పూర్తి చేసిన వారు అర్హులు. గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. వెబ్సైట్: https://www.mha.gov.in/ మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


