News September 25, 2024
వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే కీలక నిర్ణయం

వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన చోట అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు ‘రైల్ రక్షక్ దళ్’ను ఏర్పాటు చేసింది. దీని కోసం ఉద్యోగులకు అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్లో దీనిని ప్రారంభించింది.
Similar News
News November 23, 2025
MNCL: కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి అరెస్ట్

డబ్బుల కోసం కొడుకుపై దాడి చేసిన తండ్రిని అరెస్ట్ చేసినట్లు రెబ్బెన పోలీసులు తెలిపారు. కిషన్ జీతం డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న తండ్రి శంకర్ నాయక్ శుక్రవారం భోజనం చేస్తున్న కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కిషన్ తీవ్రంగా గాయపడటంతో కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శనివారం శంకర్ నాయక్ను అరెస్ట్ చేశారు.
News November 23, 2025
పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 23, 2025
నేడు భారత్ బంద్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.


