News July 28, 2024
ప్రభాస్ నుంచి వరుస అప్డేట్లు.. ఫ్యాన్స్ సంబరాలు

వరుస సినిమా అప్డేట్లతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఆదిపురుష్, సలార్, కల్కి.. రానున్న రాజా సాబ్ మూవీతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రభాస్ సినిమా అప్డేట్ల కోసం ఏళ్ల కొద్దీ వేచిచూసేవాళ్లమని.. ఇప్పుడు 20 రోజులకో న్యూస్ వస్తోందని చెబుతున్నారు. ఈ స్టార్ విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
విచారణ ఇంత జాప్యమా… వ్యవస్థకే సిగ్గుచేటు: SC

యాసిడ్ దాడి కేసుల విచారణ డేటాను సమర్పించాలని అన్ని హైకోర్టులను SC ఆదేశించింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్ల నాటి ఓ కేసు విచారణ ఇప్పటికీ పూర్తికాకపోవడంపై CJI సూర్యకాంత్ అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఇది వ్యవస్థకే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 2009లో యాసిడ్ దాడిలో గాయపడిన ఓ యువతి తన ఆవేదనను SCకి వినిపించారు. ముఖంపై యాసిడ్ దాడితో వైకల్యంతో పాటు దాన్ని తాగించిన ఘటనల్లో పలువురు ఆహారాన్నీ తీసుకోలేకపోతున్నారన్నారు.
News December 4, 2025
తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్

AP: TDP ఆధిపత్యపోరులో జరిగిన హత్య ఘటనలో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేశారని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. హతులు, హంతకులు TDP వాళ్లేనని స్వయంగా SPయే చెప్పారన్నారు. ఇవే కాకుండా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ‘ఎక్కడైనా న్యాయం ఉందా? తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది’ అని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్పై CBN గతంలో ఒకలా మాట్లాడి ఇపుడు కార్మికుల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు.
News December 4, 2025
పనిచేయని పోలీస్ వెబ్ సైట్లు.. ప్రజలకు ఇబ్బందులు

TG: సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్సైట్లు పనిచేయకపోవడంతో ఆన్లైన్ ఫిర్యాదుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ తర్వాత కేటుగాళ్లు పోలీస్ సైట్లలో లింకులు ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అయ్యేలా చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా ఐటీ విభాగం సర్వర్లను తాత్కాలికంగా డౌన్ చేసింది. అంతకుముందు మంత్రుల వాట్సాప్ గ్రూపులు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.


