News July 28, 2024
వరుస ఉగ్రదాడులు.. జమ్మూకు 2,000 మంది జవాన్లు

ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జమ్మూలోని రాజౌరీ, పూంచ్, కఠువా, ఉధంపుర్ జిల్లాల్లో జరిగిన ఘటనలు కలవరపెడుతున్నాయి. దీంతో కేంద్రం ఆ ప్రాంతాలకు 2వేలకు పైగా అదనపు BSF సిబ్బందిని తరలిస్తోంది. ఒడిశాలో మావో ఆపరేషన్లలో ఉన్న వారిని జమ్మూకు పంపుతోంది. కాగా ఈ ఏడాది ఉగ్రదాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News November 10, 2025
ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా

ఢిల్లీ <<18252218>>పేలుడు<<>> ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఘటన ఎలా జరిగిందనే కారణాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
News November 10, 2025
తెలంగాణ న్యూస్

✦ దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్కే దక్కుతుందన్న CM రేవంత్.. రేపు మౌలానా జయంతి సందర్భంగా స్మరించుకున్న CM
✦ 2026 చివరి నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
✦ ఈనెల 17, 18 తేదీల్లో HYD సమీపంలోని తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం.. <
News November 10, 2025
భోజనం చేసిన వెంటనే ఈ 5 పనులు చేయొద్దు!

భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయవద్దని, దానివల్ల ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.
*స్నానం చేయవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. 2 గంటల తర్వాత స్నానం చేయవచ్చు.
*వెంటనే నిద్రపోవద్దు. 20 నిమిషాల పాటు నడవాలి.
*చల్లటి నీరు తాగవద్దు. గోరువెచ్చని లేదా జీలకర్ర-ధనియాల కషాయం తాగాలి.
*తిన్న వెంటనే పండ్లు తినవద్దు. గంట ముందు లేదా 2 గంటల తర్వాత తినొచ్చు.
*వ్యాయామం చేయవద్దు.


