News November 20, 2024
ఆస్ట్రేలియాదే సిరీస్ విజయం: బ్రాడ్ హాగ్
BGT సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-2 తేడాతో గెలుచుకుంటుందని ఆ జట్టు మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పారు. సొంత గ్రౌండ్స్‌లో ఆడనుండటం, ప్రతిభావంతులైన సీనియర్ బౌలర్లుండటం ఆస్ట్రేలియాకు బలమని వివరించారు. ‘పేస్, బౌన్స్ ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియా పిచ్‌లపై భారత ఆటగాళ్లు ఇబ్బంది పడతారు. వారి బౌలింగ్ కూడా అనుభవలేమితో కనిపిస్తోంది. అశ్విన్, జడేజా ఇద్దరూ తుది జట్టులో కచ్చితంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2024
శైలజ కుటుంబానికి రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు
TG: ఫుడ్ పాయిజన్‌తో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన <<14706403>>విద్యార్థిని శైలజ<<>> కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.1.20 లక్షల సాయం అందజేసింది. దీంతో పాటు రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఎమ్మెల్సీ విఠల్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హామీతో గ్రామస్థులు నిన్న శైలజ అంత్యక్రియలు పూర్తి చేశారు.
News November 27, 2024
మరోసారి కెప్టెన్‌గా ‘కింగ్’?
విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వంటి ప్లేయర్లను వదులుకున్న బెంగళూరు కెప్టెన్సీని కింగ్‌కే ఇవ్వాలని యోచిస్తోందని సమాచారం. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లలో నాయకత్వ బాధ్యతలు చేపట్టే ప్లేయర్లు ఎవరూ కనిపించట్లేదు. కాగా కోహ్లీ నాయకత్వంలో RCB 144 మ్యాచులు ఆడగా 68 విజయాలు, 72 పరాజయాలు పొందగా నాలుగింట్లో ఫలితం తేలలేదు.
News November 27, 2024
ఎన్ని కేసులు పెట్టినా పారిపోను: చెవిరెడ్డి
AP: తనపై కుట్రతోనే <<14711254>>పోక్సో<<>>, ఎస్సీ, ఎస్టీ కేసుల పెట్టారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. బెదిరించి, కేసులు పెట్టి పరిపాలన చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడికి పారిపోనని, అందుబాటులోనే ఉంటానని చెప్పారు. తాను తప్పు చేసే వ్యక్తిని కాదని, అరెస్ట్ చేసుకోమని సవాల్ విసిరారు.