News September 20, 2024
‘మీసేవ’లో సర్వర్ సమస్యలు.. ప్రజలకు ఇబ్బందులు

TG: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వారాలుగా ‘మీసేవ’ సర్వర్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. క్యాస్ట్, ఇన్కమ్, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికెట్లు డౌన్లోడ్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని 5,216 మీసేవా కేంద్రాల ద్వారా 38 శాఖలకు చెందిన 204 రకాల సేవలు అందుతున్నాయి.
Similar News
News December 6, 2025
TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.
News December 6, 2025
విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా: హరీశ్

TG: కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ‘రైతులకు యూరియా సరఫరా చేయలేని రేవంత్.. విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారు. చేసిందేమీ లేక గప్పాలు కొట్టారు. గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న CM ముందు యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలి. క్యూలైన్లలో రైతులు నరకం చూస్తున్నారు’ అని మండిపడ్డారు.
News December 6, 2025
ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్కు రావాలని ఆదేశం

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.


