News October 24, 2025
సర్వీసు ఇనాం భూములకు త్వరలోనే పరిష్కారం: అనగాని

AP: సర్వీసు ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి దేవాదాయశాఖ అధికారులు, తహశీల్దార్లతో కమిటీలు వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 45 రోజుల్లో నివేదిక ఇస్తారని, దానిపై CMతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై GOM సమావేశం జరగ్గా అనగానితో పాటు నారాయణ, పయ్యావుల, ఫరూక్ పాల్గొన్నారు. పరిశ్రమలు, ఇతర భూముల కేటాయింపుపై సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News October 25, 2025
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: రాష్ట్రంలో రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపు ఉ.8.30గంటల లోపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలకు అవకాశమున్నట్లు చెప్పింది.
News October 24, 2025
సమ్మె విరమిస్తున్నాం: వైద్య సంఘాలు వెల్లడి

AP: తమ డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టమైన హామీలు ఇచ్చినందున సమ్మెను విరమిస్తున్నట్లు పీహెచ్సీ, ఏపీవీవీపీ వైద్యుల సంఘం నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను కలిసి మాట్లాడారు. పీజీ మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. గతంలో అమల్లో ఉండి నిలిచిన DNB కోర్సుల్లో ప్రవేశాలు, తదితర విషయాల్లోనూ మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
News October 24, 2025
శబరిమల గోల్డ్ చోరీ.. అమ్మేశానన్న నిందితుడు

కేరళ శబరిమల అయ్యప్ప ఆలయంలోని బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాటి నుంచి 476 గ్రా. బంగారం వేరు చేసి కర్ణాటకలో గోవర్ధన్ అనే వ్యాపారికి అమ్మినట్లు ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ అంగీకరించాడు. సిట్ అధికారుల దర్యాప్తులో దీన్ని గోవర్ధన్ సైతం ధ్రువీకరించాడు. కాగా 2019లో తాపడాలకు మెరుగులు దిద్దే పనిని ఉన్నికృష్ణన్‌కు అప్పగించగా బంగారం బరువు తగ్గిన విషయం ఇటీవల బయటపడింది.


