News April 4, 2024

‘రామాయణం’ మూవీ కోసం రూ.11 కోట్లతో సెట్‌

image

‘రామాయణం’ మూవీ అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రాముడిగా న‌టిస్తున్న ర‌ణ్‌బీర్ క‌పూర్ త్వ‌ర‌లోనే షూటింగ్‌లో పాల్గొంటార‌ని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది.

Similar News

News April 11, 2026

హీరోగా జయప్రద కొడుకు.. ఫొటో చూశారా?

image

టాలీవుడ్ సీనియర్ నటి జయప్రద దత్తత కుమారుడు సామ్రాట్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అలాగే ఓ టాప్ హీరోయిన్‌ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. సామ్రాట్ ఇప్పటికే యాక్టింగ్, డాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

News April 11, 2026

పెట్రోల్‌కు డిమాండ్.. 21 నెలల కనిష్ఠానికి LPG

image

దేశంలో మార్చిలో LPG వినియోగం 21 నెలల కనిష్ఠానికి చేరింది. 2.38 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) LPG కన్జమ్షన్ నమోదైంది. ఇది FEBతో పోలిస్తే 16%, 2025 మార్చితో పోలిస్తే 13% తక్కువ. చివరగా ఇంత తక్కువ వినియోగం 2024 జూన్‌లో నమోదైంది. దిగుమతుల్లో అంతరాయమే ఇందుకు ప్రధాన కారణం. ఇక పానిక్ బయింగ్ వల్ల మార్చిలో పెట్రోల్ వినియోగం ఆల్ టైమ్ హై (3.78 MMT) నమోదు చేసింది. డీజిల్ వినియోగం 8.73MMTగా నమోదైంది.

News April 11, 2026

వామ్మో నిమ్మ.. భారీగా పెరిగిన ధర

image

AP: ఉష్ణోగ్రతలు పెరగడంతో నిమ్మ కాయల ధరలకు రెక్కలొచ్చాయి. <<19560961>>జనవరిలో కేజీ రూ.10<<>>, మూడు వారాల కిందట కేజీ రూ.30గా ఉన్న ధర ఇప్పుడు రూ.130-135కి చేరింది. రేట్లు పెరిగినా వాతావరణ మార్పులతో దిగుబడి తీవ్రంగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎకరాకు 40 బస్తాలు వచ్చేదని, ఇప్పుడు 15 బస్తాలు కూడా రావడం లేదంటున్నారు. మరోవైపు పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.