News March 21, 2025
ట్రంప్‌కు ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. భారతీయ రీసెర్చర్ బాదర్ ఖాన్‌ను US నుంచి బహిష్కరించొద్దని వర్జీనియా కోర్టు ఆదేశించింది. బాదర్ ఖాన్‌కు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ట్రంప్ ప్రభుత్వం అతడిని గత సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అరెస్టును సవాల్ చేస్తూ బాదర్ ఖాన్ కోర్టును ఆశ్రయించగా అతడికి కోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
Similar News
News March 28, 2025
ప్రభుత్వం సంచలన నిర్ణయం

TG: పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో మెట్రోరైలు MD ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండటం గమనార్హం. ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల కొత్తగా 6వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది.
News March 28, 2025
ఆసుపత్రిలో చేరిన కింగ్ ఛార్లెస్-3

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 ఆసుపత్రిలో చేరారు. 76ఏళ్ల ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అందుకు చికిత్స తీసుకుంటుండగా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌తో హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం కింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని లండన్‌లోని బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. 2022లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత బ్రిటన్ కింగ్‌గా అవతరించిన ఛార్లెస్‌కు 2024 ఫిబ్రవరిలో క్యాన్సర్ నిర్ధారణ అయింది.
News March 28, 2025
సెలవు రోజుల్లోనూ పని చేయనున్న కార్యాలయాలు

దేశవ్యాప్తంగా ఈనెల 29, 30, 31 తేదీల్లో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసులు పనిచేయనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుండగా, ఆలోగా పన్ను చెల్లింపుదారులు పెండింగ్‌లో ఉన్న తమ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలవులున్నప్పటికీ కార్యాలయాలు పని చేస్తాయని CBDT తెలిపింది. అటు ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలూ 30, 31 తేదీల్లో పనిచేయనున్నాయి.