News July 19, 2024
HYDలో ఏఐ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

TG: హైదరాబాద్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ మేధ(AI) సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో ప్రభుత్వ పాలన, పారిశ్రామిక రంగంలో ఏఐను వినియోగించే దిశగా ప్రణాళికల్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. బ్రిటిష్ హైకమిషన్, ఇ అండ్ వై ప్రతినిధులతో సమావేశంలో ఈ అంశంపై ఆయన చర్చించారు. ఏఐ సిటీలో కీలకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మంత్రి వారిని కోరారు.
Similar News
News November 24, 2025
కామారెడ్డి: కానిస్టేబుల్ కుటుంబాలకు చెక్కులు అందజేత

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ రవికుమార్, బుచ్చయ్య కుటుంబాలకు పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి రూ.కోటి విలువ గల చెక్కులను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఎస్బీఐ రీజినల్ మేనేజర్ బృందంతో కలిసి సోమవారం అందజేశారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
News November 24, 2025
48 గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం

మలేషియా-అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి 48 గంటల్లో ఇది దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు అధికారులు చెప్పారు.
News November 24, 2025
బంకుల్లో జీరోతో పాటు ఇది కూడా చూడండి

వెహికల్స్‌లో పెట్రోల్/ డీజిల్ ఫిల్ చేయిస్తే మెషీన్‌లో 0 చెక్ చేస్తాం కదా. అలాగే ఫ్యూయల్ మెషీన్‌పై ఉండే డెన్సిటీ మీటర్ నంబర్స్ గమనించారా? BIS గైడ్‌లైన్స్ ప్రకారం క్యూబిక్ మీటర్ పెట్రోల్: 720-775 kg/m³ లేదా 0.775 kg/L, డీజిల్: 820 to 860 kg/m³ ఉండాలి. ఇది ఫ్యూయల్ ఎంత క్వాలిటీదో చెప్పే మెజర్‌మెంట్. ఇంజిన్ పర్ఫార్మెన్స్, జర్నీకి ఖర్చయ్యే ఫ్యూయల్‌పై ప్రభావం చూపే డెన్సిటీపై ఇకపై లుక్కేయండి.
Share It


