News December 4, 2024
హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు

సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(GSEC)ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ ఆగస్టులో CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. టోక్యో తర్వాత ఆసియా-పసిఫిక్ రీజియన్లో ఏర్పాటు చేయనున్న తొలి సెంటర్ ఇదే. GSEC దేశంలో అధునాతన సెక్యూరిటీ, ఆన్లైన్ ఉత్పత్తుల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరించనుంది. సైబర్ సెక్యూరిటీలో పరిశోధనలకు వేదికగా నిలవనుంది.
Similar News
News October 30, 2025
అది వారి ‘రేటు జాబితా’.. ప్రతిపక్షాల మ్యానిఫెస్టోపై మోదీ సెటైర్లు

బిహార్లో ప్రతిపక్ష మహాగఠ్బంధన్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ‘జంగిల్ రాజ్ నాయకులు ప్రజలను నిరంతరం మోసం చేస్తున్నారు. మ్యానిఫెస్టో పేరుతో ఆర్జేడీ, కాంగ్రెస్ తమ రేటు జాబితాను రివీల్ చేశాయి. వారి ప్రతి డిక్లరేషన్ వెనుక ప్రధాన ఉద్దేశం అవినీతి, దోపిడీ’ అని ఆరోపించారు. బిహార్ను RJD, కాంగ్రెస్ డెవలప్ చేయలేవని, గతంలో తమ పాలనలో ప్రజలను మోసం చేశాయని అన్నారు.
News October 30, 2025
ప్రెగ్నెన్సీలో అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

థైరాయిడ్ పనితీరుకు, శారీరక, మానసిక అభివృద్ధికి అయోడిన్ ఎంతో ముఖ్యం. గర్భిణుల్లో అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లల్లో మానసిక, శారీరక అభివృద్ధి ఉండదు. అలాగే గర్భస్రావం, వికలాంగ శిశువు, మరుగుజ్జు, చెవి, కంటి సమస్యలు, నత్తి వంటివి వస్తాయంటున్నారు నిపుణులు. పాలు, పెరుగు, బ్రౌన్ రైస్, చేపలు, ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, మిల్లెట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News October 30, 2025
శరీరానికి ఎంత అయోడిన్ అవసరమంటే

శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అయోడిన్ ఉంటే సరిపోతుంది. రోజుకు కేవలం 150mg తీసుకుంటే చాలు. పిల్లలకు 50mg, గర్భిణులకు 200mg అయోడిన్ సరిపోతుంది. ఒక వ్యక్తి జీవితకాలంలో కేవలం అర టీస్పూన్ అయోడిన్ మాత్రమే అవసరమవుతుంది. మన శరీరంలో 25mg అయోడిన్ ఉంటుంది. కాబట్టి అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అలాగని అతిగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.


