News September 5, 2025
టాప్-100లో ఏపీ& TG నుంచి ఏడు కాలేజీలు

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ఈ ఏడాది విడుదల చేసిన అత్యున్నత విద్యాసంస్థల ర్యాంకుల్లో తమిళనాడు టాప్‌లో ఉంది. టాప్-100లో తమిళనాడులోనే 17 ఉండటం విశేషం. ఆ తర్వాత మహారాష్ట్రలో 11, UPలో 9, ఢిల్లీలో 8, కర్ణాటకలో & పంజాబ్‌లో 6, TGలో 5 కాలేజీలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రెండు మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. APలో AU & KLU, TGలో IIT-HYD, NIT WGL, OU, IIIT-HYD,JNTUH ఉన్నాయి.
Similar News
News September 7, 2025
గ్రహణం తర్వాత ఏం చేయాలంటే?

చంద్ర గ్రహణం తర్వాత ఉదయం లేచాక ఇంటిని శుభ్రం చేయాలని, వస్తువులపై పవిత్ర నది జలాలను చల్లి శుద్ధి చేయాలని పండితులు చెబుతున్నారు. రాత్రి మిగిలిన ఆహారాన్ని పడవేయడంతో పాటు తల స్నానం చేయాలని సూచిస్తున్నారు. దీంతో పాటు పేదలకు దుస్తులు, ఆహారం, పాలు, బియ్యం, చక్కెర వంటివి దానం చేస్తే మేలని చెబుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి 2.25గంటల తర్వాత వీడనుంది.
News September 7, 2025
క్వాంటం వ్యాలీ అభివృద్ధికి రెండు కమిటీలు

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. అపెక్స్, ఎక్స్‌పర్ట్ కమిటీల విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని డీప్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ ఏఐ కంప్యూటింగ్, డిఫెన్స్ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని చూస్తోంది.
News September 7, 2025
సౌతాఫ్రికా ఘోర ఓటమి

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో SA ఘోర పరాజయం పాలైంది. 415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ బ్యాటర్లు 72 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టు బ్యాటర్లలో టాప్ స్కోరర్ బాష్(20) అంటేనే వాళ్ల ఆట ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్చర్ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికా టాపార్డర్‌ను పడగొట్టారు. దీంతో 342 పరుగుల తేడాతో SA ఓడింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడా ఓటమి ఇదే కావడం గమనార్హం.