News October 9, 2025
ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు – వేంకటాద్రి

సాధన చేసే వ్యక్తి ఇక్కడ ధ్యానం చేస్తే.. అతని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని చేరుతుంది. అప్పుడు, అంతకుముందు 6 కొండలపై జరిపిన సాధన 6 చెడు గుణాలను (కామ, కోపం, దురాశ, పక్షపాతం, గర్వం, అసూయ) తొలగిస్తుంది. శ్రీకృష్ణుడు కాళీయ సర్పం తలపై నృత్యం చేసినట్లుగా.. ఈ చెడు గుణాలు తొలగిపోతాయి. ఈ దశలో సాధకుడికి, దేవుడికి మధ్య ఎలాంటి అడ్డు ఉండదు. ఈ అత్యున్నత స్థితిని చేరుకునే కొండనే వేంకటాద్రి అంటారు.<<-se>>#VINAROBHAGYAMU<<>>
Similar News
News October 9, 2025
‘టీమిండియా’ అనొద్దని PIL.. కోర్టు స్పందన ఇదే

తమ జట్లను టీమిండియా అనకుండా BCCIని నిరోధించాలని ఢిల్లీ HCలో PIL దాఖలైంది. అది ప్రైవేటు సంస్థ కాబట్టి తమది భారత జట్టని చెప్పుకునే అర్హత లేదని లాయర్ వాదించారు. దీంతో ‘క్రికెటర్స్ దేశానికి ప్రాతినిధ్యం వహించట్లేదా? హాకీ, ఫుట్‌బాల్, ఒలింపిక్స్.. వేటికి ప్రభుత్వం ప్లేయర్స్‌ను ఎంపిక చేస్తుంది?’ అని CJ బెంచ్ లాయర్‌కు ప్రశ్నలు సంధించింది. దీనిపై విచారణతో మీ, మా టైమ్ పూర్తిగా వృథా అని తిరస్కరించింది.
News October 9, 2025
7,267 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. ఉద్యోగాలను బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. చివరి తేదీ OCT 23. వెబ్‌సైట్: https://nests.tribal.gov.in
* ప్రతిరోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News October 9, 2025
ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ‘ఉమెన్ వింగ్’ ఏర్పాటు

పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ‘జమాత్-ఉల్-మోమినాత్’ పేరిట మహిళా వింగ్‌ను ఏర్పాటు చేసింది. జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ దీనికి నాయకత్వం వహించనుంది. ఆమె భర్త, ఉగ్రవాది యూసుఫ్ మేలో IND చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో హతమయ్యాడు. జైషే కమాండర్ల భార్యలతో పాటు బహవల్‌పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్, మెన్‌సెహ్రా ప్రాంతాల్లో చదివే మహిళలే టార్గెట్‌గా రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.