News July 31, 2024

తీవ్ర విమర్శలు.. పోలీసులకు చిన్మయి ఫిర్యాదు

image

ప్రముఖ సింగర్ చిన్మయి చేసిన పోస్టులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆమెతో పాటు హీరోయిన్ సమంత గురించి బూతులు మాట్లాడుతూ కించపరుస్తున్నారు. వీటిపై ట్విటర్‌లో హైదరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘సోషల్ మీడియాలో యువత స్పందన, వారి భాష ఇలా ఉండొద్దు. బహుశా హైదరాబాద్ పోలీసులు దీన్ని గమనించలేదేమో. ఇలాంటి భాష ఎంతో భయంకరమైనది’ అని ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News October 13, 2025

అక్టోబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1965: హాస్య నటి కల్పనా రంజనీ జననం
1973: కవి, గీత రచయిత కందికొండ యాదగిరి జననం
1987: బాలీవుడ్ నటుడు కిషోర్ కుమార్ మరణం
1990: హీరోయిన్ పూజా హెగ్డే(ఫొటోలో) జననం
1993: టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి జననం
*ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం

News October 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 13, 2025

AUS జట్టు అద్భుత ప్రదర్శన చేసింది: లోకేశ్

image

AP: <<17989428>>ఆస్ట్రేలియా<<>> మహిళల జట్టు వైజాగ్‌లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఉమెన్స్ ODI క్రికెట్‌లో హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ ఛేజింగ్(331 రన్స్) చేసిన ఆ జట్టును అభినందించారు. ‘330 రన్స్ చేసి, ఆఖరి వరకు పోరాడిన భారత మహిళల జట్టును చూస్తే గర్వంగా ఉంది. వైజాగ్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు’ అని ట్వీట్ చేశారు. CM చంద్రబాబు కూడా AUS జట్టును అభినందించారు.