News September 22, 2025

యూరియాతో తీవ్ర నష్టం: సీఎం

image

AP: యూరియా ఎక్కువగా వాడటం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యూరియా వల్ల ప్రజారోగ్యం, పంట ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రసాయనాలు, యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాల్సి ఉంది. బాధ్యతలేని నాయకులు ఎరువులు ఇవ్వలేదని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారు’ అని అసెంబ్లీలో విమర్శించారు.

Similar News

News September 23, 2025

మృత్యుంజయుడు.. విమానం టైర్లలో ప్రయాణం

image

కాబూల్ (AFG)నుంచి ఢిల్లీ వరకు (గంటన్నర జర్నీ) ఓ 13 ఏళ్ల బాలుడు విమానం టైర్లలో దాక్కుని ప్రయాణించాడు. ఇరాన్‌కు పారిపోదామని పొరపాటుగా ఢిల్లీకి వెళ్లే RQ4401 విమానం టైర్ భాగంలో కూర్చున్నాడు. ఆ టైర్లతో పాటు
అతడూ లోపలికి వెళ్లి నక్కి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. లేదంటే 30వేల అడుగుల ఎత్తులో ఆక్సిజన్ అందక, గడ్డకట్టే చలిలో చనిపోయేవాడని చెప్పారు. బాలుడు మైనర్ కావడంతో కఠిన చర్యలు ఉండవని తెలిపారు.

News September 22, 2025

‘OG’ విలన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

image

పవన్ ‘OG’ మూవీ విలన్ ఇమ్రాన్ హష్మీ (46) ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పారు. ‘వారంలో 5రోజులు జిమ్ చేస్తాను. రోజూ ఓ గంట నడుస్తాను. షుగర్స్ అస్సలు తీసుకోను. లంచ్‌లో కూరగాయలు, పప్పు, రోటీలు తింటాను. నైట్ రోటీలు కూడా తినను. చికెన్ లేదా కూరగాయలు, పప్పు, పెరుగు వంటివి తింటా. ఇప్పుడు రోజులో 16 గం.లు ఫాస్టింగ్ చేస్తున్నా. రోజుకు కనీసం 6 గంటలు నిద్రపోతాను’ అని తెలిపారు.

News September 22, 2025

MP సుధా మూర్తికీ తప్పని సైబర్ వేధింపులు

image

రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి గుర్తుతెలియని వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘SEP 5న నాకో వ్యక్తి ఫోన్ చేసి టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగినని చెప్పాడు. నా ఫోన్ నంబర్ ఆధార్‌కు లింక్ కాలేదని అన్నాడు. నాకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయన్నాడు. నా ఫోన్ కనెక్షన్ కట్ చేస్తున్నట్లు చెప్పాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.