News December 22, 2024

తీవ్ర వరదలు.. కటిక కరవు

image

గ్లోబల్ వార్మింగ్ కారణంగా రానున్న సంవత్సరాల్లో కొన్ని రాష్ట్రాలు తీవ్ర వరద, మరికొన్ని తీవ్రమైన కరవును ఎదుర్కోనున్నాయి. ఐఐటీ గువాహటి, ఐఐటీ మండీ, CSTEP అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరదలు, 91 జిల్లాలు తీవ్ర కరవు కేటగిరీలో ఉన్నాయంది. ఏపీలోని కృష్ణా, ప.గోదావరి, గుంటూరు జిల్లాలకు వరద ముప్పు, విశాఖ, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు కరవు సమస్య పొంచిఉన్నట్లు తేలింది.

Similar News

News December 22, 2024

రూ.20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

image

అస్సాంలోని కాచార్ జిల్లాలో ₹20 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప‌క్కా స‌మాచారంతో ఆప‌రేష‌న్ చేప‌ట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సిల్కూరి ర‌హ‌దారిపై మోట‌ర్ సైకిల్‌పై ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తి వద్ద ఈ సబ్‌స్టాన్సెస్ పట్టుబడ్డాయి. నిందితుడు సాహిల్ నుంచి 60 వేల యాబా టాబ్లెట్లు, 125 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాబా అనేది మెథాంఫెటమైన్, కెఫీన్ ఉత్ప్రేరకం.

News December 22, 2024

రేవంత్ అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేశారు: బండి సంజయ్

image

సీఎం రేవంత్ సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అల్లు అర్జున్‌ వ్యక్తిత్వ హననం చేసేలా రేవంత్ వ్యాఖ్యానించారు. ముగిసిన సమస్యపై అసెంబ్లీలో MIM సభ్యుడితో ప్రశ్న అడిగించారు. సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్య సృష్టించారు. ఇది ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర. రేవంత్ కక్ష సాధింపు చర్యలు వీడాలి’ అని సూచించారు.

News December 22, 2024

పరీక్షలకు ప్రిపేర్ కాలేదు.. ఓ విద్యార్థి ఏం చేశాడంటే?

image

తాను ప్రిపేర్ కాలేదని పరీక్షల్నే వాయిదా వేయించాల‌న్న ఉద్దేశంతో ఓ విద్యార్థి ఏకంగా పాఠశాలకే బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. ఢిల్లీలోని ప‌శ్చిమ్ విహార్ పాఠ‌శాల‌కు చెందిన విద్యార్థి Dec 14న ఈ చర్యకు పాల్పడ్డాడు. పోలీసులు IP ఆడ్ర‌స్‌ను ట్రేస్ చేసి అత‌ని ఇంటికి వెళ్లారు. ఆ విద్యార్థి విష‌యాన్ని అంగీక‌రించ‌డంతో కౌన్సిలింగ్ ఇచ్చారు. అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌పై నిఘా ఉంచాల్సిందిగా త‌ల్లిదండ్రుల‌ను ఆదేశించారు.