News April 4, 2024

నేడు 130 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రాష్ట్రంలోని 130 మండలాల్లో ఈరోజు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం 19, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, కృష్ణా 1, NTR 14, తూ.గో 3, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, కడప జిల్లాలో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News November 9, 2024

ఇవాళ్టి నుంచే శనగ విత్తనాల విక్రయాలు

image

TG: యాసంగి సీజన్ కోసం రైతులకు నేటి నుంచి శనగ విత్తనాలను పంపిణీ చేయనున్నారు. క్వింటాలు ధర రూ.9,000 ఉండగా, ప్రభుత్వం రూ.300 రాయితీ ఇస్తోంది. జేజీ 11, జాకీ రకాల విత్తనాలను 20వేల క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉంచారు. కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048, జేజీఎల్ 24423 రకాలు 50వేల క్వింటాళ్ల వరకు విక్రయించనున్నారు. కరోనాకు ముందు 33% రాయితీతో విక్రయించగా, ఇప్పుడు 3.3% సబ్సిడీనే ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు.

News November 9, 2024

రేపు అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. పశ్చిమ దిశగా కదులుతూ ఇది తమిళనాడు/ శ్రీలంక తీరాలకు సమీపంగా వెళ్తుందని తెలిపింది. దీని ప్రభావంతో APలోని ప్రకాశం, NLR, TPTY, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం నుంచి 3 రోజులు భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. సముద్రం అలజడిగా ఉంటుందని, వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.

News November 9, 2024

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

image

TG: మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతిదేవి మరణించారు. అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. జ్యోతిదేవి మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలియజేశారు. 1998లో మెట్‌పల్లి ఉపఎన్నిక సందర్భంగా ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. సుమారు 17 నెలలపాటు ఎమ్మెల్యేగా సేవలందించారు.