News April 21, 2025
రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు

ఏపీలో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యంలోని 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి రూరల్‌లో 42.1 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, విజయనగరంలో 41.5 డిగ్రీలు, నెల్లూరు దగదర్తిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. ఎల్లుండి కూడా 12 మండలాల్లో తీవ్ర, 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Similar News
News April 22, 2025
హారన్ నొక్కితే ఫ్లూట్, తబలా, వయోలిన్ సౌండ్స్?

హారన్ నొక్కితే వాయిద్య పరికరాల శబ్దాలు వస్తే ఎలా ఉంటుంది? దేశంలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇదే ఆలోచనను అమలుచేయాలని భావిస్తున్నట్లు జాతీయ రహదారుల శాఖా మంత్రి గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. హారన్ కొట్టినా వినేందుకు వినసొంపుగా ఉండేలా కొత్త చట్టాన్ని తీసుకువద్దామనుకుంటున్నట్లు వెల్లడించారు. హార్మోనియం, ఫ్లూట్, తబలా వంటి పరికరాల శబ్దాల్ని పెట్టించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ అభిప్రాయం?
News April 22, 2025
BREAKING: గుజరాత్ ఘన విజయం

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 199 రన్స్ లక్ష్యంలో బరిలో దిగిన KKR నిర్ణీత ఓవర్లలో 159/8 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ రహానే 50, గుర్బాజ్ 1, నరైన్ 17, వెంకటేశ్ 14, రస్సెల్ 21, రమణ్‌దీప్ 1, రింకూ సింగ్ 17, రఘువంశీ 27* రన్స్ చేశారు. రషీద్, ప్రసిద్ధ్ చెరో 2, సిరాజ్, సుందర్, సాయి కిశోర్, ఇషాంత్ తలో వికెట్ తీశారు.
News April 22, 2025
రెజిల్‌మేనియాకు వెళ్లిన తొలి భారత సెలబ్రిటీగా రానా

రెజిల్‌మేనియా కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. లాస్ వెగాస్‌లో జరిగిన రెజిల్‌మేనియా-41కి నటుడు రానా దగ్గుబాటి తాజాగా హాజరయ్యారు. ఆయన్ను ఆహ్వానించిన ఈవెంట్ నిర్వాహకులు ముందు వరుస సీటింగ్‌ను కేటాయించారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు రానా పేరును వారు అనౌన్స్ చేయడం విశేషం. రెజిల్‌మేనియాకు హాజరైన తొలి భారత సెలబ్రిటీగా రానా చరిత్ర సృష్టించారు.