News April 11, 2025
రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు 61 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కృష్ణా జిల్లా గన్నవరం, కంకిపాడు, పెదపారుపూడి, ఉంగుటూరు, ఉయ్యూరు మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది. ఇవాళ అత్యధికంగా వైఎస్సార్(D) అట్లూరులో 41.4°C, ప్రకాశం(D) గుంటుపల్లిలో 41.2°C ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపింది. వడగాలులు వీచే మండలాల లిస్ట్ కోసం ఇక్కడ <
Similar News
News April 18, 2025
అమెరికాలో తెలుగమ్మాయి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని గుంటూరుకు చెందిన 24 ఏళ్ల వి.దీప్తి మరణించారు. ఈనెల 12న టెక్సాస్‌లోని ఇంటి ముందు తన స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుకనుంచి వాహనం వచ్చి ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా దీప్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్నిగ్ధ ఆరోగ్యం నిలకడగా ఉంది. దీప్తి నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నారు.
News April 18, 2025
4 వారాల ఫారిన్ టూర్‌కు ప్రభాస్?

రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కొంతకాలం షూటింగ్‌లకు విరామం ఇచ్చినట్లు సమాచారం. తన డ్రీమ్ డెస్టినేషన్ అయిన ఇటలీలోని ఓ పల్లెటూరుకు డార్లింగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు వారాలపాటు ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. తిరిగొచ్చాక పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసి కొత్త సినిమాలపై ఫోకస్ చేస్తారని టాక్.
News April 18, 2025
రేవంత్.. మీ బాస్‌ల కేసుపై మౌనమెందుకు?: KTR

TG: నేషనల్ హెరాల్డ్ కేసుపై CM రేవంత్ ఎందుకు స్పందించడం లేదని BRS నేత KTR ప్రశ్నించారు. ‘ఓవైపు కాంగ్రెస్ నేతలంతా వీధుల్లో నిరసనలు తెలుపుతుంటే రేవంత్ మాత్రం తన బాస్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విషయంలో మౌనమెందుకు పాటిస్తున్నారు? నాకొక్కడికే ఇది తేడాగా అనిపిస్తోందా?’ అని Xలో సెటైర్ వేశారు. కాగా ఈ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఈడీ ఛార్జిషీట్‌లో చేర్చిన విషయం తెలిసిందే.