News October 24, 2024
తీవ్రరూపం దాల్చిన తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

AP: ‘దానా’ తుఫాన్ వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారిందని APSDMA తెలిపింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు భితార్కానికా-ధమ్రా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దానా ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News January 19, 2026
‘రాజాసాబ్’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.139.25 కోట్లు(నెట్) వసూలు చేసినట్లు Sacnilk తెలిపింది. నిన్న ఈ సినిమా రూ.2.50 కోట్లు రాబట్టినట్లు అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ.180 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
News January 19, 2026
ECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని <
News January 19, 2026
వరిలో అగ్గి తెగులు – నివారణకు సూచనలు

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.


