News May 20, 2024
సెక్స్ వర్కర్లు ఇంట్రెస్టింగ్గా ఉంటారు: భన్సాలీ

మధ్యతరగతి కుటుంబాల్లోని గృహిణులు రేషన్ కోసం క్యూలో నిలబడటం తననెప్పుడూ ఆకర్షించలేదని స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు. తన సినిమాల్లో ఎక్కువగా సెక్స్ వర్కర్లు, డాన్స్ గర్ల్స్ పాత్రలు ఉండటంపై స్పందిస్తూ.. ‘వారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. డాన్స్ చేస్తారు.. పాటలు పాడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, దుస్తులు, ఆభరణాల వాడకం వారికి బాగా తెలుసు. వారిని అర్థం చేసుకోవడం కష్టం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 7, 2026
పాక్కు వ్యాక్సిన్ కష్టాలు: భారత్తో పెట్టుకుంటే తప్పదు మరి!

భారత్తో సంబంధాలు చెడగొట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్కు ఒక్కొక్కటిగా తెలిసొస్తోంది. 2025 మే నాటి సైనిక ఘర్షణల తర్వాత ఇండియా నుంచి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో ఆర్థికంగా భారం పడుతోందని స్వయంగా ఆ దేశ మంత్రి ముస్తఫా వెల్లడించారు. GAVI ద్వారా ఇండియా నుంచి తక్కువ ధరకే టీకాలు పొందిన పాక్ ఇప్పుడు ఏటా $400 మిలియన్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. సొంతంగా వ్యాక్సిన్లు తయారు చేసుకోవడం వారికి తప్పేటట్లులేదు.
News February 7, 2026
KCRపై చర్యలు తీసుకునే దమ్ము లేదా: కిషన్ రెడ్డి

TG: KCR అక్రమాలపై చర్యలు తీసుకునే దమ్ము లేకపోతే CM పదవికి రేవంత్ రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘KCRపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో రేవంత్ చెప్పాలి. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత CMది కాదా? అధికారంలోకి వచ్చాక KCRకు చిప్పకూడు తినిపిస్తా, దోచుకున్న డబ్బంతా కక్కిస్తా అని అన్నారు. ఇప్పుడు ఆయనపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు’ అని ప్రెస్మీట్లో విమర్శించారు.
News February 7, 2026
8 ఏళ్లు మేమే ఉంటాం.. ఎవరొస్తారో రండి: సీఎం

TG: BRS నేతలకు కడుపు నిండా విషమేనని సీఎం రేవంత్ అన్నారు. ‘BRSకు ఓటు వేస్తే పాముకు పాలు పోసినట్లే. వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దు. కేసీఆర్ తన కుటుంబానికే ఉద్యోగాలిచ్చారు. మేం 70వేల ఉద్యోగాలు ఇచ్చి వెలుగులు నింపాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నాం. ఇప్పటి నుంచి 8 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఎన్నికల్లో ఎవరెవరు అడ్డొస్తారో చూద్దాం’ అని పరిగి సభలో సవాల్ విసిరారు.


