News April 4, 2024

పృథ్వీషాపై లైంగిక ఆరోపణలు.. విచారణకు ఆదేశం

image

క్రికెటర్ పృథ్వీ షాపై సప్న గిల్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన లైంగిక ఆరోపణలపై విచారణ చేయాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. జూన్ 19లోపు నివేదిక అందజేయాలని తెలిపింది. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను పృథ్వీషా గతంలోనే ఖండించారు. కాగా గతేడాది ఫిబ్రవరిలో షా, సప్నల మధ్య గొడవ జరిగింది. షాపై దాడి చేసినందుకు సప్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.

Similar News

News October 30, 2025

బంతి తగిలి యంగ్ క్రికెటర్ మృతి

image

ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. బంతి తగిలి యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్(17) ప్రాణాలు కోల్పోయాడు. మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బెన్ మెడకు బంతి బలంగా తాకడంతో చనిపోయాడు. అతడి మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంచి భవిష్యత్ ఉన్న ఆటగాడిని కోల్పోయామని పేర్కొంది. కాగా పదకొండేళ్ల క్రితం ఆసీస్ బ్యాటర్ ఫిలిప్‌ హ్యూస్‌ కూడా బంతి తాకి ప్రాణాలు కోల్పోయారు.

News October 30, 2025

అయోధ్య రామునికి రూ.3వేల కోట్ల విరాళం

image

అయోధ్యలో రామ మందిరం కోసం 2022 నుంచి ఇప్పటి వరకు రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు అందాయి. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లను నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. నవంబర్ 25న ఆలయంలో జరిగే జెండా ఆవిష్కరణ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మరో 8 వేల మందిని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.

News October 30, 2025

APPLY NOW: MGAHVలో ఉద్యోగాలు

image

మహాత్మాగాంధీ అంతర్ రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం 23 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://hindivishwa.org/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.