News November 20, 2024
చిన్నారులపై లైంగికదాడులు.. కలెక్టర్ కన్నీళ్లు

AP: కాకినాడలో విద్యార్థినులను వేధించిన టీచర్, చిన్నారులపై అఘాయిత్యాలపై మాట్లాడుతూ కలెక్టర్ షాన్ మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘కీచక టీచర్ల గురించి తెలిసికూడా చెప్పకపోతే తప్పు. చేజేతులా పిల్లల జీవితాలను నాశనం చేసినవారవుతారు. నా పేరెంట్స్ టీచర్లు. వాళ్లు కష్టపడి నన్ను ఇంతదాకా తీసుకొచ్చారు. వాళ్లు స్కూల్లో డ్యూటీ చేయకపోయినా, వాళ్ల వల్ల పిల్లలు చెడిపోయినా ఆ పాపం మాకు వచ్చేది’ అని పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేక్!

దీపావళికి ఒక్కరోజు ముందే టీమ్ఇండియా(M&W) క్రికెట్ జట్లు ఓడిపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేసింది. నిన్న తొలుత పురుషుల జట్టు ఆసీస్‌తో తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత WWCలో భాగంగా జరిగిన కీలక మ్యాచులో మహిళల టీమ్ కూడా పరాజయం చెందడం సగటు అభిమానికి బాధను మిగిల్చింది. గెలవాల్సిన మ్యాచులో హర్మన్ సేన 4 పరుగుల తేడాతో ఓడటం టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు నిజంగా హార్ట్‌బ్రేకే.
News October 20, 2025
509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్‌లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. SC, STలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://ssc.gov.in
News October 20, 2025
దీపావళి రోజున కచ్చితంగా చేయాల్సిన పనులు

లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే ఇష్టం. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచి, ప్రతి మూల దీపాలు వెలిగించి పూజ చేయాలి. పూజ సమయంలో విగ్రహం (లేదా) ఫొటోను ఎర్రటి వస్త్రంపై ఉంచాలి. పూజను తూర్పు (లేదా) ఈశాన్య మూలలో చేయాలి. ఇంటి గుమ్మం వద్ద కుంకుమ, పసుపుతో స్వస్తిక్ వేసి, గడపకు పూజ చేయాలి. ఇది పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది. పూజలో భాగంగా అఖండ దీపం వెలిగిస్తే.. అది మరుసటి రోజు ఉదయం వరకు ఆరిపోకుండా జాగ్రత్త వహించాలి.