News January 20, 2025
అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. 57 మంది అరెస్టు

కేరళలో అథ్లెట్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు 57 మందిని అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మినహా అందరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. ఐదు సార్లు యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు విచారణలో తేలింది. తనకు 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ ఇరుగు పొరుగు వ్యక్తులు, కోచ్‌లు, తోటి అథ్లెట్లు లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు.
Similar News
News November 19, 2025
కరప: రూ.1.48 లక్షలు డ్రా చేశారంటూ ఫిర్యాదు

కరపకు చెందిన ఓ మీడియా ప్రతినిధి బ్యాంక్ ఖాతా నుంచి బుధవారం రూ.1.48 లక్షలు కేటుగాళ్లు డ్రా చేశారు. ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా, ఈ మొత్తాన్ని డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో ఆందోళన చెంది, వెంటనే క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇలా సొమ్ములను కాజేస్తున్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
News November 19, 2025
వన్డేల్లో తొలి ప్లేయర్‌గా రికార్డు

వెస్టిండీస్ ప్లేయర్ షై హోప్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఫుల్ మెంబర్ టీమ్స్ అన్నింటిపై సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. అటు వన్డేల్లో హోప్ 19 సెంచరీలు నమోదు చేశారు. అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ ఫుల్ మెంబర్స్ టీమ్స్. కాగా ఇవాళ్టి రెండో వన్డేలో వెస్టిండీస్‌పై NZ గెలిచింది.
News November 19, 2025
సూసైడ్ బాంబర్: క్లాసులకు డుమ్మా.. ఆర్నెళ్లు అజ్ఞాతం!

ఢిల్లీ పేలుళ్ల బాంబర్ ఉమర్‌కు అల్ ఫలాహ్ వర్సిటీ స్వేచ్ఛ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అతడు క్లాస్‌లకు సరిగా వచ్చేవాడు కాదని, వచ్చినా 15 ని.లు మాత్రమే ఉండేవాడని సహచర వైద్యులు విచారణలో తెలిపారు. 2023లో ఆర్నెళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లాడన్నారు. ఉమర్‌ను తొలగించాల్సి ఉన్నాతిరిగి రాగానే వర్సిటీ విధుల్లో చేర్చుకుందని చెప్పారు. పోలీసుల వరుస విచారణలతో డాక్టర్లు, స్టూడెంట్లు వర్సిటీ నుంచి వెళ్లిపోతున్నారు.


