News July 29, 2024

మహిళా స్విమ్మర్లపై ‘సెక్సీ’ కామెంట్.. కామెంటేటర్ తొలగింపు

image

పారిస్ ఒలింపిక్స్ కవరేజీలో బాబ్ బల్లార్డ్ అనే కామెంటేటర్ నోరు జారారు. 4x100m ఫ్రీస్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఆస్ట్రేలియన్ మహిళా స్విమ్మర్లను ‘సెక్సీయస్ట్’ అని వ్యాఖ్యానించారు. దీనిపై విమర్శలు చెలరేగడంతో అతడిని తొలగించినట్లు యూరో‌స్పోర్ట్స్ వెల్లడించింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News December 4, 2025

14,967 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ( ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.

News December 4, 2025

పంటను బట్టి యూరియా వాడితే మంచిది

image

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.

News December 4, 2025

త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాహుల్ గాంధీ!

image

AP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శిస్తారని AICC అధికార ప్రతినిధి సునీల్ అహీరా తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోహినూర్ వజ్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇచ్చిన ప్లాంటును బీజేపీ అదానీకి అమ్మేస్తోందని, దాన్ని అడ్డుకుంటామని తెలిపారు. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.