News February 6, 2025

డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్: మంత్రి

image

AP: ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో 5వేల మంది డ్వాక్రా మహిళలకు 50% రాయితీతో షేడ్‌నెట్స్ అందిస్తామని చెప్పారు. ఒక్కో షెడ్ వ్యయం ₹3.22Lకాగా సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని స్త్రీనిధి, బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పారు. జాతీయ జీవనోపాధుల పథకం కింద రాష్ట్రానికి ₹1,000Cr కేంద్ర నిధులు పొందనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 6, 2025

బంగ్లా పితామహుడి ఇంటికి నిప్పు

image

బంగ్లాదేశ్ పితామహుడిగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని బంగ్లా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. దేశంలోని తమ అవామీ లీగ్ కార్యకర్తలందరూ ఏకమై మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై తిరగబడాలని మాజీ ప్రధాని హసీనా ఆన్‌లైన్ వీడియోలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రి, బంగబంధు రెహమాన్ భవనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

News February 6, 2025

అజిత్ ‘పట్టుదల’ పబ్లిక్ టాక్

image

అజిత్, త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన ‘విదాముయార్చి’(పట్టుదల) మూవీ ప్రీమియర్ షోలు యూఎస్‌లో మొదలయ్యాయి. ఈ యాక్షన్ సినిమా ఫస్టాఫ్ స్లోగా మొదలైనా ట్విస్టులు, కమర్షియల్ ఎలిమెంట్లు బాగున్నాయని పలువురు పోస్టులు చేస్తున్నారు. అజిత్ నటన, అనిరుధ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. కొన్ని సీన్లలో దర్శకుడు కాస్త తడబడినట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News February 6, 2025

ఇవాళ జగన్ ప్రెస్ మీట్

image

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!