News April 11, 2025
చెన్నైలో షా.. TN BJP అధ్యక్షుడి ప్రకటన నేడే!

తమిళనాడు BJPకి ఇవాళ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. చెన్నైలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి అమిత్ షా స్థానిక నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన చెన్నై బయల్దేరారు. దీంతో నూతన అధ్యక్షుడిని షా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఇటీవల అన్నామలై ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News September 15, 2025
దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్

దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ జట్టు నిలిచింది. బెంగళూరులో జరిగిన ఫైనల్లో సౌత్ జోన్‌పై ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో సెంట్రల్ జోన్ ప్లేయర్స్ యశ్ రాథోడ్(194), కెప్టెన్ పాటీదార్(101) సెంచరీలతో చెలరేగారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సారాన్ష్ జైన్(8 వికెట్లు, 69 రన్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా యశ్ (194, 13 రన్స్) నిలిచారు. స్కోర్లు: సౌత్ జోన్ 149&426, సెంట్రల్ జోన్ 511&66/4.
News September 15, 2025
త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: మంత్రి అనగాని

AP: భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలను కూడా అరికట్టేలా చర్యలు చేపట్టామన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేసి పారిశ్రామిక వేత్తలకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా చేశామని వివరించారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
News September 15, 2025
15 శాతం వృద్ధిరేటు సాధనే ధ్యేయం: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. 15 శాతం వృద్ధి రేటు సాధనే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘విభజన వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయింది. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ-4ను తీసుకువచ్చాం. టెక్నాలజీని ఉపయోగించుకుని హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.