News July 1, 2024
పాకిస్థాన్‌ను గడగడలాడించిన అబ్దుల్ హమీద్‌కు షా నివాళులు

‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీత వీర్ అబ్దుల్ హమీద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా 1965 భారత్ -పాక్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఘటనను హోం మంత్రి గుర్తుచేసుకున్నారు. ఈ యుద్ధంలో శత్రువులకు చెందిన 7 యుద్ధ ట్యాంకులను హమీద్ ఒంటిచేత్తో ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆయన ధైర్యసాహసాలు దేశప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని ట్వీట్ చేశారు.
Similar News
News April 10, 2026
రైతు భరోసా రెండో విడతపై అప్‌డేట్

TG: రైతు భరోసా రెండో విడత సాయాన్ని ఈ నెల 22లోపు అందించేందుకు ప్రభుత్వం నిధులు సిద్ధం చేస్తోంది. ఈ విడతలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నగదు జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే మూడో విడత సాయాన్ని ఈ నెలాఖరులోగా జమ చేయొచ్చని తెలుస్తోంది. కాగా గత నెల 23న తొలి విడత కింద ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున సాయం అందించిన విషయం తెలిసిందే.
News April 10, 2026
మే 22/23న ‘స్వయంభు’ రిలీజ్?

భరత్ కృష్ణమాచారి డైరెక్షన్‌లో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభు’ సీజీ వర్క్స్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మే 15 నాటికి వాటిని పూర్తి చేసి 22 లేదా 23వ తేదీల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సంయుక్తా మేనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలోనే మూవీని రిలీజ్ చేయాల్సి ఉండగా గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆలస్యమవుతోంది.
News April 10, 2026
రష్యాvs ఉక్రెయిన్.. యుద్ధానికి 2 రోజులు బ్రేక్

రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి 2 రోజులు బ్రేక్ పడనుంది. క్రిస్టియన్లకు పవిత్రమైన ఆర్థడాక్స్ ఈస్టర్ సందర్భంగా ఈనెల 11న 4PM గంటల నుంచి 12న అర్ధరాత్రి వరకు కాల్పుల విరమణ పాటించనున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. కాగా ప్రస్తుతం US దృష్టి ఇరాన్ వైపు మళ్లడంతో ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఆగిపోయాయి.


